నిరుద్యోగుల మధ్య చిచ్చు పెట్టిన బీఆర్ఎస్.. టీపీసీసీ జనరల్ సెక్రటరీ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

రుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడింది బీఆర్ఎస్ హయాంలో కాదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావుని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ప్రశ్నించారు.

నిరుద్యోగుల మధ్య చిచ్చు పెట్టిన బీఆర్ఎస్.. టీపీసీసీ జనరల్ సెక్రటరీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడింది బీఆర్ఎస్ హయాంలో కాదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావుని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలను వక్రీకరించి నిరుద్యోగుల మధ్య అగాధం సృష్టించి పనిలో BRS ఉందన్నారు. అగ్రికల్చర్ లీకేజీ అయింది అని హరీశ్‌రావు మాట్లాడడం సిగ్గుగా ఉందని విమర్శించారు. జగిత్యాల కళాశాలలో ఇన్ సర్వీస్ అభ్యర్థి కాపీ కొడుతూ దొరికాడు.. అధికారులు వెంటనే రాసిన పరీక్షను రద్దు చేశారని తెలిపారు. పది ఏళ్లు పాలించి అనేక లీకేజీలకు పాల్పడి అనేక నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడారని పేర్కొన్నారు. కనీసం ఇంటర్ పరీక్షలు సక్రమార్గంగా నిర్వహించారా? అని ప్రశ్నించారు. మీ చేతకాని తనంతో 35 విద్యార్థుల ను బలి తీసుకుంది మీరు కదా? అని ఆరోపించారు.

ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధం

నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ గురించి పది ఏళ్లలో ఒక్క రోజు అయినా సమీక్ష చేశారా? అని నిలదీశారు. హరీశ్‌రావు మాజీ మంత్రి పది ఏళ్లు పని చేసిన మీరు అబద్ధాలు, తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మోసం చేయలేరన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పక్షపాతిగా ఉన్నారు.. కాబట్టే ఏడాది లోన్ 65 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు శాసనమండలిలో ప్రైవేట్ రంగంలో లక్షలాది మందికి అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ ఉంటాయని మాట్లాడిన మాటలను వక్రీకరించి నిరుద్యోగుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం BRS మీడియా చేసిందని విమర్శించారు. తెలంగాణ యువత భవిష్యత్ కోసం సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ లో చిన్న పొరపాటుకు సీఎం రేవంత్ రెడ్డి వైస్ ఛాన్సలర్ను తొలగించారని విషయాన్ని హరీశ్‌రావు గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. 26 నెలలుగా ఆవగింజ తప్పిదం లేకుండా ప్రజా పాలన నడుస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఖాళీల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

Next Story