TG News : బీసీలను నిండా ముంచిందే బీజేపీ : టీపీసీసీ జనరల్ సెక్రెటరీ చరణ్ కౌశిక్

by Muthe.Rajitha |   (  Updated:2025-02-16 16:20:43  IST  )

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయాలని చూస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

TG News : బీసీలను నిండా ముంచిందే బీజేపీ : టీపీసీసీ జనరల్ సెక్రెటరీ చరణ్ కౌశిక్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయాలని చూస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు టీపీసీసీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్(Charan Koushik Yadav). కాంగ్రెస్ బీసీలను ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు.. అసలు బీసీలను నిండా ముంచిందే బీజేపీ(BJP) అని మండిపడ్డారు. బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాటయిచ్చి మాటతప్పింది బీజేఎల్పీ నేతగా ఓసీ సామజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డి(Mahehswer Reddy)ని చేసిందని.. మరి మీ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రాజసింగ్ ను ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీసీ ప్రధాన మంత్రి అని చెప్పుకొనే నరేంద్ర మోడీ(PM Narendra Modi).. ఎందుకు బీసీ కులగణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, వారు ఎందుకు జాతీయ స్థాయిలో కులగణన(Cast Census)ను చేయడం లేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ప్రధాని చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్ ఎందుకు కల్పించడం లేదో.. రూ. 6.50 లక్షల కోట్ల బడ్జెట్ లో ఎందుకు బీసీలకి నిధులు ఇవ్వడం లేదు మోడీ, కిషన్ రెడ్డి ఇద్దరూ సమాధానం చెప్పాలని చరణ్ కౌశిక్ నిలదీశారు.

Next Story