కేటీఆర్ కేసులో రాజకీయం లేదు : టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్

by Muthe.Rajitha |

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తనను విచారించేందుకు కేటిఆర్ ను గవర్నర్ అనుమతించడంతో కేసు న్యాయపరంగా ఎదుర్కోలేక ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ పేర్కొన్నారు.

కేటీఆర్ కేసులో రాజకీయం లేదు : టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తనను విచారించేందుకు కేటిఆర్ ను గవర్నర్ అనుమతించడంతో కేసు న్యాయపరంగా ఎదుర్కోలేక ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధ్యం కాని అనేక అంశాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అమలు అవుతున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్ రేస్ కేసులో హెచ్ఎండీఏ నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు జరిగాయని అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ ఫిర్యాదుతో అక్రమాలు బయటకు వచ్చాయని అన్నారు. ఏసీబీ మరింత లోతైన విచారణతో రూ.44.88 కోట్లు అక్రమాలు జరిగాయని రుజువు అయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై... కేటీఆర్ అధికారంలో ఉన్నప్పడు డ్రోన్ ఎగరవేస్తే కేసు పెట్టి జైలుకు పంపిన విషయాన్ని కేటీఆర్ మర్చిపోయినా... తెలంగాణ ప్రజలు మర్చిపోలేదన్నారు.

తమ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో కక్ష సాధింపు చర్యలకు అవకాశం ఇవ్వలేదని చనగాని అన్నారు. కేటీఆర్, హరీష్ రావుల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు సాగుతోందని, బలపరీక్షలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ హుందాతనంతో ఉండాలని, భాధ్యతతో మెలగాలన్నారు.

తాను రాష్ట్రానికి రాజు అన్నట్లుగా, రాష్టం తన ఎస్టేట్ అన్నట్లుగా వ్యహరించొద్దని హితవు పలికారు. ఈ కార్ రేస్ కేసులో రాజకీయ కోణం లేదని అవినీతి మాత్రమే ఉందన్న కేటీఆర్... అది నిజమని చట్టబద్ధంగా నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.

Next Story