TPCC: ఎల్లుండి టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. ఆ అంశాలపై కీలక చర్చ!

by Prasad Jukanti |

ఎల్లుండి టీపీసీసీ కార్యవర్గ సమావేశం కాబోతున్నది.

TPCC: ఎల్లుండి టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. ఆ అంశాలపై కీలక చర్చ!
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం (TPCC executive meeting) ఎల్లుండి గాంధీ భవన్ (Gandhi Bhavan) లో జరగనుంది. ఈ భేటీకి టీపీసీసీ చీప్ మహేఎశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ వ్యవహరాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ లు, అనుబంధ సంఘాల ఛైర్మన్ లు, కార్పొరేషన్ చైర్మన్ లు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కో ఆర్డినేటర్లు, కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ కోసం వేసిన కో ఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొననున్నారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత అంశాలపై ప్రధానంగా చర్చించననున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Next Story