TPCC: ఏపీ రాజకీయాల్లో లుకలుకలు.. కాంగ్రెస్ నేత అద్దంకి హాట్ కామెంట్స్

by Ramesh Goud |   (  Updated:2025-01-22 05:50:55  IST  )

బీజేపీ రాజకీయ స్వార్థమే దాని పతనానికి కారణమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్(TPCC General Secretary Addanki Dayakar ) అన్నారు.

TPCC: ఏపీ రాజకీయాల్లో లుకలుకలు.. కాంగ్రెస్ నేత అద్దంకి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాజకీయ స్వార్థమే దాని పతనానికి కారణమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్(TPCC General Secretary Addanki Dayakar ) అన్నారు. బుధవారం ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన బీజేపీ(BJP)పై హాట్ కామెంట్స్ చేశారు. భారతదేశ రాజ్యంగ పరిరక్షణను కాంగ్రెస్ పార్టీ(Congress party) ప్రాథమిక బాధ్యత గా తీసుకున్నదని, రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాజ్యాంగ పరిరక్షకుడుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. బీజేపీ రాజ్యాంగవాద దృక్పథం, రాజకీయ స్వార్థమే దానిని పతనం వైపు నెడుతున్నాయని, రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా బీజేపీ అవతరించడమనేది చాలా ప్రమాదకరమైన అంశమని పేర్కొన్నారు.

ఇక ఇటీవల ఏపీ రాజకీయాల్లో(AP Politics) చూస్తున్నామని, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సీఎం(CM) అవ్వాలని, లోకేష్(Nara Lokesh) డిప్యూటీ సీఎం(Deputy CM) అవ్వాలని గిల్లిగజ్జాలు వస్తున్నాయని, ఇది కూటమిలో లుకలుకలకు ఉదహారణ అని చెప్పారు. చంద్రబాబుతో కయ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రమాదం అని తెలిసినా పవన్ కళ్యాణ్ తో బీజేపీ ముందుకు వెళ్లి, బాబుని పక్కకు తొయ్యాలనే కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. పంజాబ్ తో అకాళీదల్ తో అయినా.. మహారాష్ట్రలో షిండేతో అయినా.. ఇలాగే ఉన్నదని, మిత్రునితో రాజకీయ లబ్ది పొంది ఏ విధంగా అదే రాజకీయ పార్టీని అంతం చేయాలనే ఎత్తుగడే బీజేపీకి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు చాలా జాగ్రత్తగా ఉన్నారని, బీజేపీకే భవిష్యత్తులో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నదని చెప్పారు. బీజేపీ 2029 లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడం కోసం నార్త్, సౌత్ లో రాజకీయ కుట్రలు చేస్తుందని ఆరోపణలు చేశారు.

ఉదహరణకు అయోధ్య దేశ ప్రజలందరిదీ అయినా బీజేపీ దానిని సొంతంగా బావిస్తున్నదని, అలాగే కుంభమేలాను ప్రజలు అందరూ జరుపుకుంటారని, కానీ బీజేపీ సొంత కార్యక్రమంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. అంతేగాక దేశంలో జెమిలి తో ప్రయోగాలు చేసి రాజకీయ ప్రేరేపిత కుట్రలు చేస్తున్నదని, దేశంలో రాజకీయ ప్రత్యర్థులపై కసిగా శత్రుత్వం పెంచుకోవడం బీజేపీకి ఆనవాయితీగా మారిందని వ్యాఖ్యానించారు. బీజేపీకి శత్రువులు వఅవసరం లేదని, దాని రాజకీయ స్వార్థమే పతనానికి దారి తీస్తుందని మండిపడ్డారు. ఇక భారత రాజ్యాంగ పరిరక్షకుడిగా రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు ఉండబోతుందని, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ లాంటి నాయకులు రాజకీయ అస్తిత్వం కోసం మాట్లాడుతున్నారని, రాబోయే రోజులన్నీ ఇండియా కూటమివేనని గుర్తుంచుకోవాలని అద్దంకి అన్నారు.

Next Story