బెంగుళూరుకు చేరుకున్న టీపీసీసీ కాంగ్రెస్ నాయకులు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-15 17:19:22  IST  )

రెండు రోజుల పాటు బెంగుళూరులో నిర్వహిస్తున్న ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశానికి బీసీ నేతలు హాజరైయ్యారు. వారంతా మంగళవారం బెంగుళూరుకు చేరుకున్నారు.

బెంగుళూరుకు చేరుకున్న టీపీసీసీ కాంగ్రెస్ నాయకులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు రోజుల పాటు బెంగుళూరులో నిర్వహిస్తున్న ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశానికి బీసీ నేతలు హాజరైయ్యారు. వారంతా మంగళవారం బెంగుళూరుకు చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు అనిల్ కుమార్ జైహింద్, సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, బీకే.హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పూర్ణిమ యాదవ్ కు కర్ణాటక కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆధ్వర్యంలో బెంగళూరులో రాత్రి నిర్వహించిన ఏఐసీసీ ఓబీసీ నేషనల్ అడ్వైజరీ మండలి సమావేశంలో పాల్గొన్నారు. నేడు (బుధవారం) జరుగనున్న సభలో మంత్రులు, బీసీ నేతలు ప్రసంగించనున్నారు.

Next Story