- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పోరేషన్ నుంచి రెండు పేర్లు ఇవ్వండి.. డీసీసీ చీఫ్‌లకు టీపీసీసీ చీఫ్లేఖ
మున్సిపల్ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ సభ్యుల నియామకం కోసం ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పోరేషన్ నుంచి రెండు పేర్లు ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులకు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ సభ్యుల నియామకం కోసం ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పోరేషన్ నుంచి రెండు పేర్లు ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులకు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆయన వారికి లేఖ రాశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ కు సంబంధిత కార్యకలాపాలకు సమర్దవంతైమన సమన్వయం, ప్రణాళిక, పర్యవేక్షణ లక్ష్యంగా సమన్వయ కమిటీని నియమిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. దీనికి మీ పరిధిలోని మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పోరేషన్ నుంచి రెండు పేర్లను ఈ కమిటి సభ్యులుగా నియమిస్తామన్నారు.
డీసీసీ చీఫ్‌లు సిఫార్సు చేసే పేర్లలో ఒకరు అడ్వకేట్ ఉండవచ్చని, తద్వారా ఎన్నికల ప్రక్రియలో చట్టపరమైన సమన్వయంతో పాటు కమిటి బలోపేతం అవుతుందని మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. పంపే పేర్లలో అనుభవజ్ఞులైన, చురుకైన, అంకితభావం కలిగిన కాంగ్రెస్ కార్యకర్త ఉండాలన్నారు. ఈ పేర్లను టీపీసీసీ ఉపాధ్యక్షులు జగదీశ్వర్ రావుకి సోమవారం నాటికి వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా ఇవ్వాలన్నారు. పీసీసీ కార్యాలయంలో నేరుగా సమర్పిస్తే కమిటీని వెంటనే ఏర్పాటు చేసి సన్నాహా సమావేశాలను వెంటనే ప్రారంభించవచ్చన్నారు.






