'వీఆర్ఏలది అర్థంలేని ఆందోళనైతే.. నీది నరంలేని నాలుకా?'

by Disha Web Desk 2 |
వీఆర్ఏలది అర్థంలేని ఆందోళనైతే.. నీది నరంలేని నాలుకా?
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకులు అర్థంలేని ఆందోళన చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వీఆర్ఏల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించగా.. అందుకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. తాజాగా.. కేసీఆర్ స్పందించిన విధానంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ''వీఆర్ఏలది అర్థంలేని ఆందోళన ఐతే.. మీది నరంలేని నాలుకనా కేసీఆర్!, 2020 సెప్టెంబర్ 9న ఇదే అసెంబ్లీలో వారికి పే స్కేల్ ఇస్తాం, పదోన్నతులు ఇస్తాం అని హామీ ఇచ్చింది మీరు కదా!, తాజాగా వీఆర్ఏల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.'' అంటూ సీరియస్‌ అయ్యారు.

Also Read : వీఆర్ఏలను చర్చకు పిలిచిన మంత్రి కేటీఆర్

Also Read : భారీగా తరలివచ్చిన వీఆర్ఏలు.. అదుపుచేయలేకపోయిన పోలీసులు



Next Story