- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Himachal and Gujarat ఫలితాలపై Revanth Reddy కీలక వ్యాఖ్యలు
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో మోడీ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ అనుకూల మీడియా మోడీ ఓటమిని చిన్నగా చూపించాయని అన్నారు. మోడీకి ఓటమి లేదు అనుకుని విర్రవీగే వారికి ఈ ఫలితాలు కనువిప్పు కలిగిస్తాయని అన్నారు. అంతేగాక, బీఆర్ఎస్ ఏర్పాటు మీద అభ్యంతరం తెలపడానికి ఢిల్లీలో ఐదు రోజులు వెయిట్ చేశానని, అయినా ఎన్నికల ప్రధానాధికారి అపాయింట్మెంట్ ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రపతి, ప్రధానితో పాటు ఎన్నికల అధికారికి కూడా ఆన్లైన్‌లో కంప్లైంట్ చేశానని అన్నారు.
Also Read....
Next Story






