కాకతీయ యూనివర్శిటీని మూయించేందుకు ప్రభుత్వం కుట్ర: రేవంత్ రెడ్డి

by Satheesh |
కాకతీయ యూనివర్శిటీని మూయించేందుకు ప్రభుత్వం కుట్ర: రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో యూనివర్శిటీలు లేకుండా చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు. ఇటీవల పోలీసుల చేతిలో గాయపడిన వరంగల్ కాకతీయ యూనివర్శిటీ విద్యార్థి సంఘం స్టూడెంట్స్‌ను రేవంత్ రెడ్డి పరామర్శించారు. బుధవారం వరంగల్ వెళ్లిన రేవంత్ రెడ్డి విద్యార్థులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్శిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లలో జరిగిన అవకతవకలపై ప్రశ్నిస్తే విద్యార్థులపై దాడులు చేశారని నిప్పులు చెరిగారు. వీధి రౌడీలా మాదిరిగా విద్యార్థులను కొట్టిస్తున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. యూనివర్శిటీల్లో జరిగే అన్యాయాలపైనే విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని.. ప్రశ్నిస్తే విద్యార్థులను శత్రువుల మాదిరిగా చూస్తున్నారని ధ్వజమెత్తారు.

కాకతీయ వర్శిటీలో జరిగిన అన్యాయాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్శిటీని మూయించేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. విద్యార్థి ఉద్యమకారులే తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. పోలీసుల చేతిలో దాడులకు గురైన విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడులు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాకతీయ యూనివర్శిటీ రిజిస్ట్రార్, వీసీని సస్పండ్ చేయాలన్నారు.

Advertisement

Next Story