- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గద్దర్ మరణాన్ని తట్టుకోలేక పోతున్నా: TPCC చీఫ్ రేవంత్ రెడ్డి
ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరణంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరణంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక పోతున్నామన్నారు. ఇటీవల జరిగిన ఖమ్మం జనగర్జన సభలో గద్దర్ రాహుల్ గాంధీతో ఎంతో ఆప్యాయంగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. గాంధీ కుటుంబం పట్ల అపార అభిమానులు ఉన్న వ్యక్తి గద్దర్ అని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడు.. తెలంగాణ సాధన కోసం తన ఆట, పాటలతో జనాన్ని ఎంతో ఉతేజపరిచిన వ్యక్తి గద్దర్ అని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా, గద్దర్ మృతికి సంతాప సూచకంగా కాంగ్రెస్ శ్రేణులు అన్ని మండల కేంద్రాలలో ముఖ్య కూడళ్లలో గద్దర్ చిత్ర పటాలు పెట్టి నివాళులు అర్పించాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Read More..
Next Story






