- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్‌పై టీపీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన జనసేన
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ హీట్‌ను పుట్టిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన (Janasena) పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ హీట్‌ను పుట్టిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ (BJP) తరఫున పవన్ ప్రచారం చేయబోతున్నారని ప్రకటన వెలువడిన నేపథ్యంలో మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా, ఆ వ్యాఖ్యలకు తెలంగాణ జనసేన పార్టీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తెలంగాణ పార్టీలు కాదు జాతీయ పార్టీలని అన్నారు. అలాగే జనసేన కేవలం ఆంధ్ర కోసం పెట్టిన పార్టీ కాదని. జాతీయ సమగ్రత కోసం తెలంగాణ గడ్డ మీద పెట్టిన పార్టీ అని తెలిపారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చూస్తే ఊరుకోం అంటూ జనసేన తెలంగాణ పెట్టిన పోస్ట్ తాజాగా వైరల్ అవుతోంది.
మహేశ్ కుమార్ గౌడ్ ఏమన్నారంటే..
పవన్ ఆంధ్రాలో రాజకీయం చేసుకోవాలని.. తెలంగాణ (Telangana)లో కాదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్ చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ వ్యక్తుల గురించి, భాష, సంస్కృతి గురించి దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. అందుకే పవన్‌ను తాము దిష్టి కల్యాణ్ అని అంటామని సెటైర్లు వేశారు. దారణంగా ఓడిపోతామనే భయంతో పవన్ కల్యాణ్ లాంటి సినీ తారలను బీజేపీ నాయకులు అడుక్కునే పరిస్థితి వచ్చిందని మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు.






