Mahesh Kumar: కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉంది..? మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్

by Ramesh Naini |

బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను మేము చేపట్టినప్పుడు కవిత జైలులో ఉన్నారని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు.

Mahesh Kumar: కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉంది..? మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను మేము చేపట్టినప్పుడు కవిత జైలులో ఉన్నారని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) హాట్ కామెంట్స్ చేశారు. తీహార్ జైలులో ఉన్న కవిత (MLC Kavitha) బీసీ రిజర్వేషన్ల కోసం ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. (Congress) కాంగ్రెస్ పాలనలో కుల సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు విప్లవాత్మక నిర్ణయాలు అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మేము సాధించిన రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన విజయమని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో సామాజిక న్యాయం జరగలేదని కవిత మాట్లాడారని చెప్పుకొచ్చారు. కవిత మాటలు విని తెలంగాణ సమాజం నవ్వుకుంటోందని విమర్శలు చేశారు. కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా? అని ప్రశ్నించారు. ఇక, బీసీలకు రిజర్వేషన్ల పెంపు కీలకమైన నిర్ణయాన్ని అభినందించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR)కు మనసు రావటం లేదని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ఎన్నో బిల్లుల విషయంలో బీజేపీకి మద్దతు ఇచ్చిందని వివరించారు.

బీసీలకు మేలు కలిగే నిర్ణయంపై మాత్రం కేసీఆర్ నోరు విప్పడం లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి పట్టించుకోలేదన్నారు. అలాగే బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై ఇంత వరకు కేంద్ర నుంచి ఉలుకు లేదు.. పలుకు లేదన్నారు.

Next Story