- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీకి లేఖ రాసే దమ్ముందా? కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సవాల్
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డంకిగా మారారని టీపీసీసీ చీఫ్ మహేశ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay) అడ్డంకిగా మారారని టీపీసీసీ చీఫ్ మహేశ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ కులగణన తప్పులు తడక అనడం కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్‌తో దోస్తీ కట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం విషం కక్కడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. (Caste census) కులగణన పై కేంద్రం నిర్ణయంతో రాహుల్ సంకల్పం సిద్ధించిందన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రుల బృందం కుల గణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిందని అన్నారు. శాసన సభలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల సాక్షిగా ఏకగ్రీవ తీర్మానంతో బీసీ కుల గణనకు చట్ట బద్దత కల్పించినట్లు తెలిపారు. బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో బీసీ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని 50 శాతం రిజర్వేషన్లు పరిమితి ఎత్తివేసేలా పార్లమెంట్ లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లు చట్ట బద్దత కోసం ప్రధాని మోడీకి లేఖ రాసే దమ్ముందా అని కేంద్ర మంత్రులకు సవాల్ విసిరారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర మంత్రులమని మరిచి మాట్లాడటం వారి అహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు. పారదర్శక సర్వేపై తప్పుడు ఆరోపణలు చేయడానికి బీసీ బిడ్డగా బండి సంజయ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కేంద్రం జనగణన తో పాటు కులగణన నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వ విజయమన్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా కుల గణన ఎప్పుడు నిర్వహిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర భారతావనిలో కుల గణన నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. చారిత్రాత్మక కుల గణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయాలతో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందన్నారు.






