- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TPCC: "ఎవరు ఎంత నిష్పత్తిలో ఉంటే వారికి అంత వాటా" టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
"ఎవరు ఎంత నిష్పత్తిలో ఉంటే వారికి అంత వాటా" అనే రాహుల్ గాంధీ నినాదానికి కట్టుబడి కుల సర్వే నిర్వహించామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: "ఎవరు ఎంత నిష్పత్తిలో ఉంటే వారికి అంత వాటా" అనే రాహుల్ గాంధీ నినాదానికి కట్టుబడి కుల సర్వే నిర్వహించామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నెక్లెస్ రోడ్‌లో ఇందిరాగాంధీ కాంస్య విగ్రహం వద్ద తెలంగాణ బంజారా భారతి ఆధ్వర్యంలో లంబడాలను షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్లలో చేర్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాజరై ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ దేశంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొచ్చారని తెలిపారు. సీలింగ్ ఆక్ట్ ద్వారా పేదలకు భూములు పంచిన మహానియురాలు ఇందిరా గాంధీ అని కొనియాడారు. బంజరాలను షెడ్యూల్డ్ ట్రైబ్‌లో చేర్చిన చలువ ఆమెదేనని అన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉందన్నారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. మార్ఫింగ్ చేసి అసత్యాలను ప్రచారం చేస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, అసత్య ప్రచారాలను నమ్మకండని సూచించారు. తెలంగాణ ఉక్కు మనిషి కొండ లక్ష్మణ్ బాపూజీ అని, వారు అనుసరించిన మార్గం మార్గదర్శకమన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి నాయకులు అరుదని, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన త్యాగమూర్తి అని చెప్పారు.






