కవిత ఎపిసోడ్‌ను డైవర్ట్ చేయడానికే కేటీఆర్ డ్రామా : పీసీసీ చీఫ్ మహేష్

by Naga Rani Yarlagadda |

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యల్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఖండించారు.

కవిత ఎపిసోడ్‌ను డైవర్ట్ చేయడానికే కేటీఆర్ డ్రామా : పీసీసీ చీఫ్ మహేష్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యల్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఖండించారు. ఇంట్లో కుంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమవుతున్నాడని, ఏకు మేకై మరో పవర్ సెంటర్ రావడంతో మతిభ్రమించి రేవంత్ రెడ్డిపై నోటికొచ్చిన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పదేళ్ల కాలంలో జరిగిన బీఆర్ఎస్ (BRS) తప్పిదాలను కవిత (Kavitha) ఎత్తి చూపారని, ఆ ఎపిసోడ్ ను డైవర్ట్ చేసేందుకే కేటీఆర్ సీఎం రేవంత్ పై ఆరోపణలు చేశారన్నారు.

కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో కేటీఆర్ భయపడుతున్నాడని, బీఆర్ఎస్, బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉన్నట్లు కవిత వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పార్టీ పగ్గాల కోసం కవిత, కేటీఆర్ మధ్య పోటీ తీవ్రం కావడంతో హరీష్ రావు (Harish Rao) అదనుకోసం ఎదురు చూస్తున్నారని, త్వరలోనే బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతుందని తెలిపారు. మరోవైపు కేసీఆర్ (KCR) ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్నారు. నిజానికి కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలెవరో ప్రజలందరికీ తెలుసని, పదేళ్ల అవినీతిలో పంపకాల్లో వచ్చిన తేడాతోనే, కవిత జెండా ఎగరవేసినట్లు క్లియర్ గా అర్ధమవుతుందన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.

Next Story