‘కల్వకుంట్ల కవిత ఓ మంచి పని చేశారు’.. పీసీసీ చీఫ్ హర్షం

by Gantepaka Srikanth |

తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘కల్వకుంట్ల కవిత ఓ మంచి పని చేశారు’.. పీసీసీ చీఫ్ హర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత(Kalvakuntla Kavitha) కొన్ని కఠోర సత్యాలు, అబద్ధాలు రెండూ మాట్లాడారని అన్నారు. అయితే ముందుగా అందరం కవిత కేసీఆర్(KCR) విడిచిన బాణం అని అనుకున్నాం.. కానీ ఆ బాణం హరీష్ రావు వైపు ఎందుకు తిరిగింది అనేదే తెలియట్లేదు అన్నారు. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకే కేసీఆర్ కుటుంబం కొత్త నాటకం ఆడుతోందని విమర్శించారు. కవిత రాజీనామా చేయడం శుభ పరిణామంగా భావిస్తామని చెప్పారు. కానీ ఈ రాజీనామా ఐదేళ్ల ముందు చేసుంటే బాగుండేది.. ప్రజలు కూడా అంగీకరించేవారని హితవు పలికారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుని.. వాటాల పంపకాల్లో రావడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి, ఇప్పుడు ఆ పార్టీ బాగోతం బయటపెడుతోందని అన్నారు. తన వరకూ వస్తే గానీ కవితకు బీఆర్ఎస్(BRS) పాలన ఎలా సాగిందో అర్ధం కాలేదని చెప్పారు. హరీష్ రావు, సంతోష్ రావుల వెనుక ఉండాల్సిన ఖర్మ మాకేంటి అని మండిపడ్డారు. తాము ఎప్పుడూ ప్రజల వెంట ఉంటామని అన్నారు. అనవసరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు.

Next Story