సీఎం రేవంత్ ​రెడ్డితో టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ భేటీ

by Malleboina Mahesh |   (  Updated:2025-09-06 16:42:16  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎం రేవంత్ ​రెడ్డితో టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఆయన నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రిని మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ను సీఎం రేవంత్​అభినందించారు.

మహేష్ కుమార్ గౌడ్ కి అభినందనలు తెలిపిన మాజీ ఎంపీ వి.హెచ్​

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్​సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, అందుకోసం తన వంతు పూర్తి సహకారం ఉంటుందన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ తరఫున పోరాటం చేసిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవిల్లో తగిన గుర్తింపు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ కు వి.హెచ్​ సూచించారు.

Next Story