- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. సంచలన ప్రకటన చేసిన టీపీసీసీ చీఫ్
ఈగల్ టీమ్ చేసిన దాడిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఒక ఎంపీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని, డ్రగ్స్ మీద మా ప్రభుత్వం ఉక్కు మోపుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఈగల్ టీమ్ చేసిన దాడిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఒక ఎంపీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని, డ్రగ్స్ మీద మా ప్రభుత్వం ఉక్కు మోపుతోంది. డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామని టీపీసీసీ చీఫ్మహేష్కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువ నాయకుడి బ్యాచ్ మొత్తం డ్రగ్స్ కార్యక్రమాల్లో దొరుకుతున్నారని, బీఆర్ఎస్ నేతలు ఇంత మంది దొరుకుతుంటే బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడితే ఆయన నోరు ఎందుకు మూయించారని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు. డ్రగ్స్ విషయంలో బీజేపీ నేతల వైఖరి జనాలకు చెప్పాలని, వారం రోజులు గడుస్తున్న మీరు ఎందుకు డ్రగ్స్ మీద మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ ఎన్నికల్లోనే కాదు.. బయట కూడా కలిసి పని చేస్తున్నారని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది..అందుకే మాట్లాడడం లేదని ఆయన ఆరోపించారు.
బీఆర్ఎస్ హయంలో మీ బీజేపీ అగ్ర నాయకులను అరెస్ట్ చేసింది మరిచిపోయారా, బీజేపీ నేతలు బీసీల గురించి మాట్లాడితే విడ్డూరంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. బండారు దత్తాత్రేయ బీజేపీ ఎన్నో సేవలు అందించారని, ఆయన సికింద్రాబాద్ సీటును కిషన్ రెడ్డి లాక్కున్నారని, ఆయనకు ఉన్న ఒక్క గవర్నర్ పదవిని కూడా మరొక అగ్ర కుల నాయకుడు లాక్కున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను దించి కిషన్ రెడ్డి లాక్కున్నారని, బీసీల గురించి బీజేపీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. మేము బీసీలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నూతనంగా విప్ లుగా నియమితులైన వారికి మహేష్‌కుమార్ గౌడ్ అభినందనలు తెలిపారు.






