T.Congress: వాళ్లంతా కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్‌(Congress)లో చేరికలపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.

T.Congress: వాళ్లంతా కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌(Congress)లో చేరికలపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీ భవన్‌(Gandhi Bhavan)లో ఆయన మీడియాతో మాట్లాడారు. చాలామంది బీఆర్ఎస్(BRS) నేతలు తమతో టచ్‌లో ఉన్నారని అన్నారు. అతి త్వరలోనే వారంతా కాంగ్రెస్‌లో చేరబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు(Harish Rao), కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నోటికి ఏది వస్తే అదే మాట్లాడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. తప్పు చేసిన అందరూ శిక్షార్హులే అని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 100 శాతం అభివృద్ధి చేశామని అన్నారు.

రాష్ట్రంలో రేవంత్(CM Revanth Reddy) మార్క్ పాలనకు బీజం పడుతోందని తెలిపారు. ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి బీఆఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రెండు లక్షలకు పైగా రుణమాఫీ(Runa Mafi) ఒకే దశలో దేశంలో ఎక్కడా జరుగలేదని అన్నారు. అంతేకాదు.. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే 50 వేల ఉద్యోగాలు కూడా ఇప్పటివకు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ జరుగలేదని అన్నారు. తమ ప్రభుత్వంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు అంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు.

Next Story