- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TPCC: ఏడాది నుంచి కేసీఆర్ ఎవరికీ కనిపించడం లేదు
తెలంగాణ(Telangana)లోని ప్రతిపక్ష పార్టీల నేతలను టీపీసీసీ(TPCC) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) హెచ్చరించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లోని ప్రతిపక్ష పార్టీల నేతలను టీపీసీసీ(TPCC) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) హెచ్చరించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డి గూడలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల సిద్ధాంతం ఆధారంగా కాంగ్రెస్ ప్రజా పాలన(Congress Govt) కొనసాగుతోందని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇళ్లు, రేషన్ కార్డు రాలేదని విమర్శించారు. చౌక బారు విమర్శలు చేయొద్దని ప్రతి పక్షాలను హెచ్చరిస్తున్నానని అన్నారు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉక్కు మహిళ ఇందిరమ్మ పేరు పెట్టొద్దని అంటున్నాడని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ(Congress Party) అంటే నమ్మకం.. మాట ఇస్తే నిలుపుకుంటామని ప్రకటించారు. అన్ని కులాలు, మతాలను అక్కున చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మాటకు కట్టుబడి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చిపోయారని మండిపడ్డారు. ఏడాది నుంచి కేసీఆర్ ఎవరికీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఫాంహౌస్‌కు పరిమితమైన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు? అని ప్రశ్నించారు. తాము ఎన్నికల వరకే రాజకీయాలు చేస్తామని.. ఆ తర్వాత అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యం అని అన్నారు.






