- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ అంశాల్లో టీపీసీసీ చీఫ్ జోక్యం.. సరికాదంటున్న సీనియర్లు
ఈ మధ్య పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

దిశ,తెలంగాణ బ్యూరో: ఈ మధ్య పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన మాట్లాడిన అంశాలు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వ వర్గాల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. భవిష్యత్ లో సైతం ఆయన ఇదే విధంగా వ్యవహరిస్తే వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిసెంట్ గా డిల్లీ పర్యటనలో మహేశ్ కుమార్ మీడియాతో పిచ్చాపాటిగా పార్టీ, ప్రభుత్వంలోని అంతర్గత అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. పార్టీలోని అంశాలపై అధ్యక్షుడి హోదాలో ఏమైన మాట్లాడవచ్చు. కాని ప్రభుత్వ అంశాలపై ఆయన తన అభిప్రాయాలను బయటికి చెప్పడం సరికాదని సీనియర్ లీడర్లు సూచిస్తున్నారు.
కేబినెట్ ప్రక్షాళన సీఎం పరిధిలోని అంశం
మంత్రివర్గం ప్రక్షాళన చేయడమా? ఒకవేళ చేస్తే ఎవరిని తీసుకోవాలి?ఎవరిని తప్పించాలి?ఏ మంత్రులు శాఖలు మార్చాలి?అనే అంశాలు పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి పరిధిలోనివి. ఈ విషయాలపై ఆయన అధిష్టానాన్ని సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయనకు ప్రభుత్వంలో జరిగే పరిణామాలు తెలుస్తుంటాయి. ప్రక్షాళన చేసే ముందు అధిష్టానం కూడా ఆయన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని చాన్స్ ఉంటుంది. అయితే ఈ విషయాలు ఆయనకు తెలిసినా బయటికి చెప్పకుండా మహేశ్ కుమార్ జాగ్రత్త పడాల్సి ఉంటే బాగుండునని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అలాకాకుండా కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని చెప్పడం వల్ల ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారనే సంకేతాలు వెళ్లాయని అంటున్నారు. అలాగే ఐఏఎస్ అధికారుల పనితీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి అధికారుల పనితీరును అంచనా వేయాల్సింది సీఎం,మంత్రులు. కాని మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగంగా అధికారుల పనితీరు పై కామెంట్స్ చేయడం వల్ల అపోజిషన్ కు అస్త్రాలు అందించినట్లేనని కామెంట్స్ ఉన్నాయి.






