- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దమ్ముంటే చర్చకు రా.. భూ దోపిడీపై కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ సవాల్
హెచ్‌సీయూ భూములపై బీఆర్ఎస్ చేస్తున్న రాద్ధాంతంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు......

దిశ, వెబ్ డెస్క్: హెచ్‌సీయూ భూముల(HCU lands)పై బీఆర్ఎస్(Brs) చేస్తున్న రాద్ధాంతంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్(Hyderabad)లో బంగారం లాంటి భూములను గతంలోనే బీఆర్ఎస్ నాయకులు అమ్ముకున్న విషయం మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. ఆ భూములను సొంత నేతలకే అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ రోజు హైదరాబాద్‌లో కొండలను కూడా కరిగించి పనులు జరుగుతున్నాయని, ఆ భూములను అమ్మింది ఎవరు అని నిలదీశారు. గత పదేళ్లలో హైదరాబాద్ భూములను మాయాజాలం చేసి ఎకరా రూ.100 కోట్లకు అమ్ముకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లోనే 10 వేలకుపై చిలుకు భూములను అడ్డగోలుగా అమ్ముకున్నారని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. హెచ్‌సీయూ భూముల విషయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు అమ్మిన చరిత్ర ప్రజలకు తెలియాలని చెప్పారు. చంద్రబాబు, వాజ్‌పేయి హయాంలో హెచ్‌సీయూ భూములను ఐఎంజీ భరత్ అనే సంస్థకు చెందిన బిల్లీరావుకు అమ్మారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి(Rajasekhar Reddy) పోరాటం చేయడంతో ఆ భూములు ప్రభుత్వానికి దక్కాయని మహేశ్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన కేసీఆర్.. హెచ్‌సీయూ భూములతో పాటు పలు యూనివర్సీటీలకు చెందని భూములను కూడా దోచుకోవాలని చూశారని తెలిపారు. ఐఎంజీ భరత్ సంస్థతో 33 శాతం ముడుపులు తీసుకునేలా అప్పటి మంత్రి కేటీఆర్(Former Ktr) మాట్లాడుకున్నారని తెలిపారు. కేటీఆర్‌కు రావాల్సిన ముడుపులు రూ.5,200 కోట్లను కాంగ్రెస్‌కు అంటగడ్డే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రూ.5,200 కోట్లు తీసుకుని హెచ్‌సీయూ భూములను బిల్లీరావు(Billy Rao)కు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పన్నంగా అప్పగించేదని మహేశ్ కుమార్ పేర్కొన్నారు. హెచ్‌సీయూ భూములు ప్రభుత్వానివని, ఇందుకు బదులుగా 390 ఎకరాలు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. హెచ్‌సీయూ భూములను కాపాడింది రాజశేఖర్ రెడ్డి అని, వెనక్కి తీసుకొచ్చింది సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) అని వ్యాఖ్యానించారు. పదేళ్ల భూ దోపిడీపై దమ్ముంటే చర్చకు రండి అంటూ కేటీఆర్‌కు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు.






