దాతృత్వం చాటుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. సొంతూరికి భారీ విరాళం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-23 13:14:59  IST  )

టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సొంతూరి పట్ల తనకున్న మమకారాన్ని, బాధ్యతను చాటుకున్నారు.

దాతృత్వం చాటుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. సొంతూరికి భారీ విరాళం
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సొంతూరి పట్ల తనకున్న మమకారాన్ని, బాధ్యతను చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని తన స్వగ్రామమైన రహత్ నగర్ లో పలు అభివృద్ధి పనులను చేపట్టేందుకు 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఈ 11 ఎకరాల్లో 10 ఎకరాలను ఇంటిగ్రేటెడ్ స్కూలుకు, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సబ్ స్టేషన్ కోసం ఒక ఎకరం భూమిని దానం చేశారు. ఈ స్కూల్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అధికస్థాయి విద్య, ఆధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. మహేశ్ కుమార్ గౌడ్ దాతృత్వాన్ని మెచ్చిన గ్రామస్తులు ఆయన్ను భారీ గజమాలలతో సత్కరించారు.

ఇక.. ధర్మపురి నుంచి బాసర వరకు ప్రతిపాదించిన టెంపుల్ కారిడార్ రోడ్డు రహత్ నగర్ గ్రామం మీదుగా రానుందని, ఇందుకు తానెంతో కృషి చేశానని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం తాను చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రికోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.

READ MORE ....

మున్నూరు కాపులపై కాంగ్రెస్‌కు అనుబంధం ఎనలేనిది.. టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Next Story