బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రం మోసం చేస్తోంది: మహేష్ కుమార్ గౌడ్

by Ajay Maddhiboyina |

బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రం మోసం చేస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా బీసీ రిజర్వేషన్లు తెచ్చుకుందామని

బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రం మోసం చేస్తోంది: మహేష్ కుమార్ గౌడ్
X

దిశ‌, వెబ్ డెస్క్: బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రం మోసం చేస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా బీసీ రిజర్వేషన్లు తెచ్చుకుందామని రేవంత్ రెడ్డి శపథం చేశారని చెప్పారు. కాబట్టి ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీలో కదం తొక్కేందుకు కదలి రావాలని పిలుపునిచ్చారు. 6న జంతర్ మంతర్ లో ధర్నాకు తరలి రావాలని కోరారు.

తెలంగాణ ప్రజల కోరిక 42శాతం రిజర్వేషన్ ఆ కోరిక నెరవేర్చుకునేందుకు అందరం ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కలిసి ఢిల్లీకి రావాలన్నారు. పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీలో నరనరాన ఉందన్నారు. గాంధీజీ నుండి రాహుల్ గాంధీ వరకు పాదయాత్ర చేశారన్నారు. భారత్ జోడో యాత్ర ప్రపంచపుటల్లోకి ఎక్కిందన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల్లో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, యాత్రలు చేసిన తరవాతనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. పాదయాత్ర ద్వారా ఏం జరుగుతోంది.. జనాలు ఏం కావాలి.. అనేది తెలుస్తుందన్నారు.

Next Story