- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: సమయం లేదు మిత్రమా... కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ కీలక పిలుపు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్వం కీలక దశకు చేరుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills bypoll) కీలక దశకు చేరుకుంటోంది. ప్రధాన పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కాంగ్రెస్ శ్రేణులకు క కీలక పిలుపు ఇచ్చారు. ఈ బైపోల్‍ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీకి (Congress), రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకమైన అంశంగా పరిగణించాలని సూచించారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులు సమయం ఉందని ఈ సమయం చాలా కీలకం అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కాంగ్రెస్ విజయం కోసం శక్తి వంచన లేకుండా పని చేయాలని కోరారు.






