కవితకు పీసీసీ చీఫ్ కౌంటర్.. ఆమె ఓ మెగా రౌడీ అంటూ!

by velandi.Saikiran |   (  Updated:2025-04-26 07:21:14  IST  )

గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ( Kalvakuntla Kavitha)స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కవితకు పీసీసీ చీఫ్ కౌంటర్.. ఆమె ఓ మెగా రౌడీ అంటూ!
X

దిశ, వెబ్ డెస్క్: గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ( Kalvakuntla Kavitha)స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Goud). ఆమె లిక్కర్ రాణి అని, మెగా రౌడీ అంటూ చురకలాంటించారు. ఇవాళ రాహుల్ గాంధీ పై ( Rahul Gandhi) కల్వకుంట్ల కవిత వివాదాస్పద పోస్ట్ పెట్టారు. దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీ గారికి స్వాగతం అంటూ చురకలు అంటించారు కల్వకుంట్ల కవిత. మోసపూరిత హామీలు అలాగే అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను నిండా ముంచిన రాహుల్ గాంధీకి సుస్వాగతం అంటూ సెటైర్లు పేల్చారు కవిత.

అయితే కల్వకుంట్ల కవిత చేసిన ఈ పోస్ట్ పై తెలంగాణ పీసీసీ అధ్యక్షు లు మహేష్ కుమార్ గౌడ్ ( TPCC Chief Mahesh Goud ) స్పందించారు. కల్వకుంట్ల కవిత వాళ్ళ... నాన్నతో తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పించాలని చురకలంటించారు. లిక్కర్ వ్యాపారం చేసిన కల్వకుంట్ల కవితకు రాహుల్ గాంధీ పై మాట్లాడే అర్హత లేదని తేల్చి చెప్పారు. తనను తాను ఒక మెగా రౌడీ అని చెప్పుకొని... తిరుగుతున్న కవిత, రాహుల్ పై మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కెసిఆర్ ( KCR) హయాంలో హైదరాబాద్ భూముల అమ్మకాల లెక్కలపై కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha) మాట్లాడాలని డిమాండ్ చేశారు TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ( TPCC Chief Mahesh Goud ).

Next Story