- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
TPCC Chief: సోనియా ఇచ్చిన తెలంగాణను.. కేసీఆర్ కుటుంబ అవసరాలకు వాడుకున్నాడు! మహేష్ కుమార్ గౌడ్
దిశ: వెబ్ డెస్క్: గాంధీ భవన్(Gandhi Bhavan) అనేది మాకు దేవాలయంతో సమానమని అన్నారు టీపీసీసీ నూతన అధ్యక్షుడు (TPCC President) మహేష్ కుమార్ గౌడ్. గాంధీ భవన్ దేవాలయం అయితే సోనియా గాంధీ మాకు దేవత అని అన్నారు. అయితే సోనియా ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తన సొంత అవసరాలకు, కుటుంబ అవసరాలకు వాడుకున్నారని మహేష్ కుమర్ గౌడ్ మండిపడ్డారు.
గాంధీ భవన్ లో.. ఆదివారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) సమక్షంలో.. టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. తదనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహేష్ కుమార్ మాట్లాడుతూ.. "కాంగ్రెస్ పార్టీలో అందరికీ తగిన గుర్తింపు ఉంటుందని, దానికి ప్రస్తుత నా నియామకమే సాక్ష్యమని అన్నారు. గతంలో కేసీఆర్ ఇబ్బంది పెట్టిన తీరును చూసి, ప్రజలంతా ఏకమై.. మాకు అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కువ ఉంటుందని, పార్టీలో తాము వ్యక్తిగత విమర్శలు చేసుకున్నా.. తామంతా ఒకటేనని అన్నారు. సీఎంరేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు నాకు తగిన ప్రోత్సాహం ఇవ్వడం వల్లే ఇంత పెద్ద బాధ్యతలను చేపట్టగలిగాను" అని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో.. పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ను కోరినట్లు తెలిపారు. గాంధీ భవన్ ఉంటేనే ప్రభుత్వం ఉంటుందని, సీఎం కూడా నెలకు ఒకసారి గాంధీ భవన్ కు రావాలని అన్నారు. ప్రభుత్వం నడపడమంటే.. కేసీఆర్ మాదిరిగా ఫామ్ హౌస్ నుండి పరిపాలనను అందించడం కాదని, ప్రజలతో మమేకమై పాలనను సాగించాలని అన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.