- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీపీసీసీ చీఫ్ కు కరాటే బ్లాక్ బెల్ట్
రాజకీయంగా బిజిబిజి.. టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు.. అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా నిరంతరం ప్రజాసేవ.. అయిన కూడా కరాటే అంటే ఎంతో మక్కువ.. ఆయనే మహేశ్‌కుమార్‌గౌడ్.

దిశ, తెలంగాణ బ్యూరో : రాజకీయంగా బిజిబిజి.. టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు.. అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా నిరంతరం ప్రజాసేవ.. అయిన కూడా కరాటే అంటే ఎంతో మక్కువ.. ఆయనే మహేశ్‌కుమార్‌గౌడ్. మార్షల్ ఆర్ట్స్ తన జీవితంలో ఓ భాగం.. ఎంత ఒత్తిడి ఉన్న కరాటే కు సమయం కేటాయించే మహేష్ కుమార్ గౌడ్.. వెస్ట్ మారేడుపల్లి లో వైడబ్ల్యూసీఏలో సోమవారం 3 గంటల పాటు జరిగిన పరీక్షలో మహేష్ కుమార్ గౌడ్ అవలిలాగ నెగ్గారు. దీంతో ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7 అందుకున్నారు. అకాడమీ గ్రాండ్ మాస్టర్ ఎస్. శ్రీనివాసన్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బ్లాక్ బెల్ట్ ప్రధాన చేశారు.
ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ..ఈ సమాజంలో పత్రి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కరాటే మనిషిలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందని, ప్రస్తుత తరుణంలో కరాటే.. బాలికలకు ఎంతో అవసరం అని అన్నారు. ఆ దిశగా ప్రయత్నం చేసి కరాటేలో శిక్షణ పొందడం మంచిదన్నారు. ఇప్పటి సమాజంలో తల్లిదండ్రులు పిల్లలను ఒక కంప్యూటర్ కిడ్స్ ల తయారు చేస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని.. క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని శారీరక ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమని ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తల్లిదండ్రులు క్రీడల పట్ల ప్రోత్సహించాలన్నారు. అందుకే గత నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ జాతీయ కరాటే పోటీలను నిర్వహించామన్నారు. భవిష్యత్ లో 2027లో ఆసియా కరాటే పోటీలు కూడా ఇక్కడే నిర్వహిస్తామని ఈసందర్భంగా మహేశ్కుమార్గౌడ్స్పష్టం చేశారు.






