- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG News : కాంగ్రెస్ ఎమ్మెల్యేపై టీపీసీసీ చీఫ్ ఫైర్
by Muthe.Rajitha |
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై టీపీసీసీ చీఫ్(TPCC Chief) ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేపై టీపీసీసీ చీఫ్(TPCC Chief) ఫైర్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లో చంద్రబాబుకు కోవర్టులున్నారని ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) చేసిన వ్యాఖ్యల్లో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపాయి. అయితే అనిరుధ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర అధిష్టానం సీరియస్ అయ్యింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) నేడు గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. అనిరుధ్ వ్యాఖ్యలను ఖండించారు.
పార్టీ నేతలు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. పార్టీ కట్టుబాట్లు మీరి, క్రమశిక్షణ తప్పకూడదని, క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు మహేష్ కుమార్ గౌడ్ తెలియ జేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వివరణ కోరతామని అన్నారు.
Next Story






