- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమ పదవి కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళ్తారు.. మోడీ, అమిత్‍షా పై మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్
బీజేపీ పెత్తందారు పార్టీ అని పేదలను దోచి అదానీ, అంబానీకి కట్టబెడుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: నరేంద్ర మోడీ (Narendra Modi), అమిత్ షా (Amit Shah) రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వాళ్ళ పదవి కాపాడుకోవడానికి ఎంతవరకైనా పోతారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) విమర్శించారు. ఇవాళ గాంధీ భవన్‍లో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మొతే రోహిత్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వాట కేంద్ర వాటా అని క్రమేణా నరేగా పథకాన్ని తీసివేయలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. బీజేపీ పెత్తందారు పార్టీ అని పేదలను దోచి ఆధాని అంబానీకి కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు.
బీద వాడి గోడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పట్టట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద వాడి పార్టీ అని కాంగ్రెస్‍లో మనం ఉండటం మన అదృష్టం అన్నారు. రేవంత్ రెడ్డి విజన్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తపన పడుతున్నారని, రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు రేవంత్ రెడ్డి కుల సర్వే చేశారని గుర్తు చేశారు. మోడీ జనగణన చేస్తామన్న ఘనత రేవంత్ రెడ్డిదేనన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ విధానాలు ఎండగడుతూ రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి అందరం కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు.
READ MORE ....
దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలే: మహేశ్ కుమార్ గౌడ్






