నా రాజకీయ గురువు ‘డీఎస్’

by velandi.Saikiran |

నా రాజకీయ గురువు మాజీ పీసీసీ అధ్యక్షులు డి.శ్రీనివాస్ అని, ఆయన వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానని పీసీసీ చీఫ్​

నా రాజకీయ గురువు ‘డీఎస్’
X

-నా రాజకీయ గురువు ‘డీఎస్’..

-పీసీసీ చీఫ్​ మహేష్​కుమార్ ​గౌడ్​ కామెంట్స్

దిశ, తెలంగాణ బ్యూరో : నా రాజకీయ గురువు మాజీ పీసీసీ అధ్యక్షులు డి.శ్రీనివాస్ అని, ఆయన వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానని పీసీసీ చీఫ్​మహేష్​కుమార్​గౌడ్​అన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షులు డి.శ్రీనివాస్ మొదటి వర్ధంతి సందర్భంగా ఆదివారం గాంధీ భవన్​లో డి.శ్రీనివాస్ చిత్ర పటానికిటీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేడు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చొరవతో నిజామాబాద్ లో డి.శ్రీనివాస్ విగ్రహావిష్కరణ జరుగుతోందన్నారు. విగ్రహావిష్కరణకు కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం లేకపోవడం బాధాకరం అన్నారు. శ్రీనివాస్ గారు జీవితాంతం కాంగ్రెస్ పార్టీ ఊపిరిగా జీవించారని తెలిపారు. ఆయన పార్టీకి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పీషరీస్​చైర్మన్​మెట్టు సాయికుమార్, ఖైరతబాద్​నేత రోహిణ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story