మున్సిపల్ ఎన్నికల్లో టీపీసీసీ జిల్లా మీడియా, రిమోట్ కోఆర్డినేటర్ల నియామకం

by Ramesh Naini |

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున మీడియా కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం టీపీసీసీ మీడియా, కమ్యునికేషన్స్ విభాగం జిల్లాల వారీగా మీడియా కోఆర్డినేటర్లను నియమించారు.

మున్సిపల్ ఎన్నికల్లో టీపీసీసీ జిల్లా మీడియా, రిమోట్ కోఆర్డినేటర్ల నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున మీడియా కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం టీపీసీసీ మీడియా, కమ్యునికేషన్స్ విభాగం జిల్లాల వారీగా మీడియా కోఆర్డినేటర్లను నియమించారు. ఈ మేరకు ఆదివారం ఆ విభాగం చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి నియామక జాబితాను విడుదల చేశారు.

వరంగల్ జిల్లాకు పాలడుగు పద్మ, ఎండీ గౌస్ సంగారెడ్డి, అహ్మద్ నాజిర్ నల్గొండ, హైమావతి కరీంనగర్, జల్పల్లి నరేందర్ మహబూబ్ నగర్, రమ్యారావు మెదక్, నరేష్ రాథోడ్ నిజామాబాద్, ఇందిరా శోభన్ ఆదిలాబాద్, కల్పనా రెడ్డి ఖమ్మం జిల్లాలకు నియమించారు. కాగా రిమోట్ కోఆర్డినేటర్లుగా లింగం యాదవ్, మేడి రవిచంద్ర, బి. జగదీష్​ నేత, జక్కని అనిత, మంజులా రెడ్డిలు నియమితులయ్యారు.

Next Story