పర్యాటక రంగ అభివృద్ధిపై కేంద్రం దృష్టి: కిషన్ రెడ్డి

by GSrikanth |
పర్యాటక రంగ అభివృద్ధిపై కేంద్రం దృష్టి: కిషన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: టూరిజం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లోగో, టీజర్‌ను కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. గురువారం ఢిల్లీలోని అశోక హోటల్‌లో జరిగిన టూరిజం ఇన్ మిషన్ మోడ్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో పర్యాటక రంగ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు.

కాగా, మొదటిసారి టూరిజం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను కేంద్ర ప్రభుత్వం మే నెలలో నిర్వహించబోతోంది. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో మే 17 నుంచి 19 వరకు జరగనున్న టూరిజం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యాటక రంగ అభివృద్ధి, పర్యాటక రంగంలో పెట్టుబడులు అంశాలపై ఈ టూరిజం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ దృష్టి సారించనుంది.

Next Story