- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Exam Fee: ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ రిలీజ్
ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ ను అధికారులు రిలీజ్ చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) (Telangana Open School Society) ఆధ్వర్యంలో జరగబోయే ఓపెన్ టెన్త్ (Open Tenth), ఇంటర్మీడియట్ (Open Intermediate) ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపు (Exam Fee Schedule) షెడ్యూల్ శనివారం రిలీజ్ అయింది. డిసెంబర్ 11వ తేదీ నుంచి 26 డిసెంబర్ వరకు ఎలాంటి ఫైన్ ఫీజు లేకుండా ఫీజు చెల్లించవచ్చని టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ఒక్కో పేపర్ కు రూ.25 లేట్ ఫీజుతో 27 డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు, ఒక్కో పేపర్ కు రూ.50 ఫైన్ తో జనవరి 3 నుంచి 7 జనవరి వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. తత్కాల్ కింద జనవరి 8 నుంచి జనవరి 12 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి/ఏప్రిల్–2026లో నిర్వహించేందుకు తాత్కాలికంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
Next Story






