TG: డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత బర్సె దేవా

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-02 10:10:31  IST  )

శుక్రవారం 15 మంది మవోయిస్టులతో కలిసి తెలంగాణ డీజీపీ ఎదుట దేవా ఆయుధాలు వదిలేశారు.

TG: డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత బర్సె దేవా
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ(Maoist Party)కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సె దేవా(Maoist Barse Deva) లొంగిపోయారు. శుక్రవారం 15 మంది మవోయిస్టులతో కలిసి తెలంగాణ డీజీపీ ఎదుట దేవా ఆయుధాలు వదిలేశారు. రేపు(శనివారం) వీరిని మీడియా ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవల మృతిచెందిన మావోయిస్టు టాప్ లీడర్ హిడ్మాకు బర్సె దేవా సన్నిహితుడు. ఇద్దరు సుదీర్ఘంగా 15 ఏండ్లపాటు కలిసి పనిచేశారు. వీరిద్దరిది ఛత్తీస్‌గఢ్‌లోని పూవర్తి గ్రామమే. మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమైన పీఎల్‌జీఏ బెటాలియన్ నంబర్‌ వన్‌కు దేవా బాధ్యుడిగా ఉన్నారు. దీనిపై మావోయిస్టు పార్టీ నుంచి సైతం దీనిపై ఎలాంటి ప్రకటనా రాలేదు.

దేవాపై రూ. 50 లక్షల రివార్డు

మావోయిస్టు పార్టీలో ట్రైబల్ నుంచి హిడ్మా తర్వాత ఆ స్థాయికి ఎదిగిన మరో కీలక కమాండర్ దేవా. రెండేళ్ల క్రితమే దేవాను హిడ్మా తన బెటాలియన్‌లోకి తీసుకుని కమాండర్‌గా ప్రమోషన్ ఇచ్చినట్టు తెలిసింది. హిడ్మా తరహాలోనే దేవా కూడా చాలా ఆపరేషన్‌లలో యాక్టివ్ రోల్ ఉన్నట్టు సమాచారం. 2013 ఝీరాం ఘాటి దాడి సహా బలగాలపై జరిగిన అనేక దాడుల్లో దేవా కూడా కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. దేవాపై రూ. 50 లక్షల రివార్డు ఉన్నది.

Next Story