- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ.. రాజిరెడ్డి సహా మరో ఇద్దరు కూడా..
ఈ ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఆపరేషన్ కగార్ కొనసాగిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టు(Maoist Party) రహిత దేశంగా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఆపరేషన్ కగార్ కొనసాగిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు నలుగురు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ(Maoist Devji) అలియాస్ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి(Malla Rajireddy) అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ బడే చొక్కారావు(Bade Chokkarao) ఇలియాస్ దామోదర్, స్టేట్ కమిటీ మెంబర్ నూనె నర్సింహా రెడ్డి(Nune Narsimha Reddy) అలియాస్ గంగన్న అలియాస్ సన్ను దాదా లొంగిపోయారు. ఇవాళ ఈ నలుగురిని డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణలో మొదలైన మావోయిస్టు ఉద్యమం తెలంగాణలోనే ఆఖరి దశకు వచ్చిందన్నారు. ఈ పరిణామంతో ఆ పార్టీ అత్యున్నత స్థాయి సంస్థాగత నిర్మాణం, తెలంగాణ రాష్ట్ర కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో చేరిపోవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఈ నలుగురు అజ్ఞాతం వీడినట్లు తెలిపారు. వీరిపై ఉన్న మొత్తం 90 లక్షల నగదు రివార్డు డీడీ రూపంలో డీజీపీ అందజేశారు.






