ఫైనల్ టచ్‌కు టీ-కాంగ్రెస్ సర్వం సిద్ధం.. రంగంలోకి కీలక నేతలు..!

by Satheesh |   (  Updated:2023-11-21 17:39:34  IST  )

కాంగ్రెస్ పార్టీ తుది దశ ప్రచారాన్ని స్పీడప్ చేసింది. బుధవారం నుంచి ఏఐసీసీ అగ్రనేతల పర్యటనలు వరుసగా కొనసాగనున్నాయి. దీనిలో భాగంగా ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు

ఫైనల్ టచ్‌కు టీ-కాంగ్రెస్ సర్వం సిద్ధం.. రంగంలోకి కీలక నేతలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ తుది దశ ప్రచారాన్ని స్పీడప్ చేసింది. బుధవారం నుంచి ఏఐసీసీ అగ్రనేతల పర్యటనలు వరుసగా కొనసాగనున్నాయి. దీనిలో భాగంగా ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇప్పటికే మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 12 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన హైదరాబాద్ నుంచి అలంపూర్ వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు నల్గొండలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి ఖర్గే ఢిల్లీ వెళ్లనున్నారు.

ఆ తర్వాత ఈ నెల 24, 25, 26 తేదీల్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మూడు రోజుల్లో పది సెగ్మెంట్‌లలో పర్యటించనున్నారు. 24న ఉదయం 11గంటలకు పాలకుర్తి, మధ్యాహ్నం 2 గంటలకు హుస్నాబాద్, సాయంత్రం 4గంటలకు ధర్మపురి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు మద్ధతుగా ప్రచారం చేయనున్నారు. దీంతో పాటు ఈ నెల 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర నాలుగు నియోజకవర్గాలతో పాటు, 27న మునుగోడు, దేవరకొండ, గద్వాలలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారం, సభలలో భాగస్వామ్యం కానున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా, వరుసగా ఏఐసీసీ అగ్రనేతల పర్యటనల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటు నేతల్లోనూ జోష్​నెలకొన్నది.

Next Story