Tonique liqueur: టానిక్ లిక్కర్ గ్రూప్స్‌ సంస్థల్లో కొనసాగుతున్న రైడ్స్‌.. కీలక విషయాలు వెలుగులోకి

by Kema Shiva Kumar |

టానిక్ లిక్కర్ గ్రూప్స్‌ సంస్థలపై కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.

Tonique liqueur: టానిక్ లిక్కర్ గ్రూప్స్‌ సంస్థల్లో కొనసాగుతున్న రైడ్స్‌.. కీలక విషయాలు వెలుగులోకి
X

దిశ, వెబ్‌డెస్క్: టానిక్ లిక్కర్ గ్రూప్స్‌ సంస్థలపై కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అదేవిధంగా సంస్థకు లింక్ అయిన కార్యాలయాల్లో ఏకకాలంలో అధికారులు 11 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్‌కు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో టానిక్‌కు ఏ-4 ఎలైట్ కింద లైసెన్సులను జారీ చేసినట్లుగా కమర్షియల్ టాక్స్ అధికారులు గుర్తించారు.

అయితే, ఈ వ్యవహారం ఎక్సైజ్ పాలసీ‌కి పూర్తిగా విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా సంస్థ జీఎస్టీ తనిఖీల్లో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి అనీత్‌రెడ్డి, అఖిల్‌రెడ్డి 11 క్యూ టానిక్ సిండికేట్లు ఉండి నడిపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంచైజీలలో ముగ్గురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు సమాచారం. మాజీ సీఎంవో అధికారి కుమారుడు, ఎక్సైజ్ ఉన్నతాధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురు ప్రమేయం ఉన్నట్లుగా కమర్షియల్ టాక్స్ అధికారులు గుర్తించారు.

Next Story