TG: ఇంటర్ విద్యార్థులపై BIG అప్‍డేట్.. వాట్సాప్‌లోనే ఫలితాలు.. ప్రాసెస్ ఇదే

by Prasad Jukanti |   (  Updated:2026-04-11 05:46:39  IST  )

తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా రిజల్ట్స్ ఎలా పొందాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ తెలుసుకోండి.

TG: ఇంటర్ విద్యార్థులపై BIG అప్‍డేట్..  వాట్సాప్‌లోనే ఫలితాలు.. ప్రాసెస్ ఇదే
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రేపు విడుదల కాబోతున్న తెలంగాణ తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫలితాలను విద్యార్థులు నేరుగా తమ మొబైల్‌లోనే పొందే వెసులుబాటును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫలితాల కోసం విద్యార్థులు ఎటువంటి పోర్టల్ లాగిన్ అవసరం లేకుండా, మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. గతంలో ఇదే పద్ధతిలో లక్షలాది మంది విద్యార్థులకు హాల్ టికెట్లు విజయవంతంగా పంపిణీ చేయబడగా ఇప్పుడు ఫలితాలను సైతం సులభంగా తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఫలితాలు ఇలా పొందాలి:

మొదట మీ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ నంబర్ 8096 95 8096 నంబర్‌ను సేవ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ పంపాలి. సర్వీస్ ఎంపికలో మెనూలో BIE Exam Result అని టైప్ చేసి, 'Open Service' ఆప్షన్ నొక్కాలి.అక్కడ మీ హాల్ టికెట్ (రోల్) నంబర్ నమోదు చేసి, సంవత్సరం (1st/2nd Year), స్ట్రీమ్ (General/Vocational) ఎంచుకోవాలి. వివరాలు సమర్పించిన వెంటనే మీ ఫలితం మెసేజ్ రూపంలో తక్షణమే స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.

డిజిటల్ సేవల్లో తెలంగాణ దూకుడు

రాష్ట్రంలో మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఐటీ శాఖ 18 నవంబర్ 2025న ఈ మీసేవ వాట్సాప్ చాట్‌బాట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అతి తక్కువ కాలంలో ప్రజల నుంచి విశేషమైన ఆదరణ పొందుతున్న ఈ చాట్ బాట్ ద్వారా ప్రస్తుతం 580కి పైగా ప్రభుత్వ సేవలను పౌరులకు చేరువచేస్తోంది. రాష్ట్రంలో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌గా ఇది గుర్తింపు పొందింది. ఈ కోవలోనే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫలితాలను అందించడంతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఇదో గొప్ప ఊరటగా మారనుంది. ఈ సేవల పట్ల స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు మీసేవ వాట్సాప్ సేవ అనేది కేవలం సౌకర్యం మాత్రమే కాదు, ప్రజలు నిత్యం ఉపయోగించే సాంకేతికత ద్వారా ప్రభుత్వాన్ని ప్రతి పౌరుడి గడప వద్దకు చేర్చడమే మా లక్ష్యం అని అన్నారు.

Next Story