- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు 1034 రైతు వేదికల్లో రైతునేస్తం!
రేపు ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా 1034 రైతు వేదికల్లో రైతునేస్తం వీడియో కాన్ప్రెన్స్ ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభోత్సవంతో

దిశ, తెలంగాణ బ్యూరో : రేపు ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా 1034 రైతు వేదికల్లో రైతునేస్తం వీడియో కాన్ప్రెన్స్ ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభోత్సవంతో పాటు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు సిద్దం చేశారు. ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఆడిటోరియం వద్ద ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1600 రైతువేదికలలో, ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు, ఈ ఆడిటోరియంలో దాదాపు 1500 మంది రైతులు పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే 566 రైతువేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించి ప్రతీ మంగళవారం రైతునేస్తం కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా ముఖాముఖి మరియు ఆదర్శరైతుల అనుభవాలు, వ్యవసాయరంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను రైతులకు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 6.35 లక్షల మంది రైతులు రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవడమే కాకుండా, వివిధ రైతుల అనుభవాలను తెలుసుకున్నామన్నారు.
ఇప్పటి నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని, మరొక 1034 రైతు వేదికలకు కల్పించిన సందర్భంగా, వీటిని ప్రారంభోత్సవం చేయవల్సిందిగా సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ను కోరినట్లు తెలిపారు. తొలకరి ఆరంభమై వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న వేళ, రాష్ట్రవ్యాప్తంగా వున్న రైతు వేదికల్లో హాజరైన రైతులతో సీఎం రేవంత్రెడ్డి ముఖాముఖి ముచ్చటించనున్నారు . ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, అధికారంలోకి వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలోనే దాదాపు 78వేల కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతాంగం సుభిక్షంగా ఉండేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయని పథకాలను ఇప్పటికే అమలు చేశామన్నారు. వివిధ రాష్ట్రాలకు ఒక దశ, దిశ చూపించిందని, రుణమాఫీ, సన్న ధాన్యానికి బోనస్, అన్ని రకాల పంటలను మద్ధతు ధరకు కొనుగోలు, అన్ని పంటలకు సబ్సిడీపై సూక్ష్మ సేద్య పరికరాల సరఫరా వంటివి మచ్చుతునక అని తెలిపారు. ఈ కార్యక్రమం సోమవారం సాయంత్రం వారి వారి జిల్లాల్లో ఉన్న రైతు వేదికల నుంచి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, రైతులు, పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను ఏర్పాట్లపై ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇక్కడ పాల్గొనే రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా అధికారులను ఆదేశించారు.
భరోసా పంపిణీ రైతులకు ఉపశమనం : వానాకాలం సీజన్ప్రారంభం కావడంతో అన్నదాతలు పెట్టుబడి కోసం తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వం పంటసాగు చేసే సమయానికి రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా రైతు వేదికలను 1600లకు పెంచడం, వాటి ద్వారా రైతులకు సాగు విధానంలో అనుసరించాల్సిన మెలుకువలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల పంపిణీపై ఎప్పటికప్పడు సమాచారం ఇవ్వడంపై ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి అర్హులైన రైతులకు అందేలా స్దానిక వ్యవసాయ శాఖ అధికారులు చేస్తున్నట్లు రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.
గతేడాది 57 లక్షల మంది రైతులకు భరోసా పంపిణీ : జనవరి 27న అన్ని మండలాల్లోని 577 గ్రామాల్లోని సాగు యోగ్యమైన భూముల రైతులకు భరోసా పంపిణీ చేసింది. ఆ తరువాత మూడు విడుతల్లో మూడు ఎకరాల లోపు భూములున్న 44.82 లక్షల మంది రైతులకు చెందిన 58.13 లక్షల ఎకరాలకు రూ. 3487.82 కోట్ల జమ చేసింది. మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్నెల చివరి వరకు మరో రూ. 1500 కోట్లు రైతుల ఖాతాలో వేసింది. రాష్ట్ర ఆర్దిక పరిస్థితులను అంచనా వేస్తూ ప్రభుత్వం ఇప్పటివరకు 84.28 లక్షల ఎకరాల భూములకు సంబంధించిన 57 లక్షల మంది రైతుల ఖాతాలో భరోసా రూ. 5057 కోట్లు జమ చేసింది. రాళ్లు, రప్పలు, సాగుకు యోగ్యం కాని భూములను మినహాయిస్తే రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల ఎకరాలకు ఈ పథకం వర్తిస్తుంది.






