Telangana Formation Day: రేపే తెలంగాణ అవతరణ దినోత్సవం.. నగరానికి విచ్చేసిన స్పెషల్ గెస్ట్‌

by Ramesh Naini |

తెలంగాణ అవతరణ దినోత్సవం నేపథ్యంలో జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగనున్నాయి.

Telangana Formation Day: రేపే తెలంగాణ అవతరణ దినోత్సవం.. నగరానికి విచ్చేసిన స్పెషల్ గెస్ట్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Telangana Formation Day) తెలంగాణ అవతరణ దినోత్సవం నేపథ్యంలో జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే ఈ వేడుకలు నాంపల్లి గన్ పార్క్‌, సికింద్రాబాద్ (Parade Grounds) పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. రేపు పరేడ్​ గ్రౌండ్స్​లో జరిగే అవతరణ దినోత్సవ వేడుకలకు స్పెషల్ గెస్ట్‌లు రానున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా వేడుకలకు జపాన్​ ప్రతినిధి (Japanese team) బృందం హాజరవనుంది. ఈ సందర్భంగా జపాన్​‌లోని కితాక్యూషూ (Kitakyushu) సిటీ మేయర్ కజుహిసా టకేచీ (Kazuhisa Takeuchi) ప్రతినిధి బృందం ఆదివారం హైదరాబాద్​కు చేరుకున్నారు.

రేపు పరేడ్​ గ్రౌండ్స్​లో ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో పాటు వేడుకలకు ఈ బృందం హాజరుకానుంది. అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్​లో తెలంగాణ, కితాక్యుషూ పరస్పర సహకార ఒప్పందం చేసుకుంటాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) జపాన్​ పర్యటనకు వెళ్లిన సందర్భంగా కితాక్యుషూ సిటీని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్​కు రావాలని మేయర్‌ను సీఎం ఆహ్వానించారు. ఒకప్పుడు జపాన్‌లో అత్యంత కాలుష్యంతో ఉన్న సిటీ కితక్యూషూ.. గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఉత్తమ ఉదాహరణగా నిలిచింది. హైదరాబాద్ నగరంలో సైతం కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా కీలక ఎంవోయూలు చేసుకునే అవకాశం కన్పిస్తోంది.

Next Story