రేపే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. స్పెషల్ ​గెస్టుగా జపాన్​బృందం

by Muthe.Rajitha |

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది.

రేపే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. స్పెషల్ ​గెస్టుగా జపాన్​బృందం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం సికింద్రాబాద్​లోని పరేడ్​గ్రౌండ్​గ్రాండ్​గా వేడుకలు జరుపనుంది. ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. జిల్లాలో మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందన స్వీకరిస్తారు. పరేడ్​గ్రౌండ్లో నిర్వహించే వేడుకులకు స్పెషల్​గెస్టులు విచ్చేస్తున్నారు. జపాన్​లోని కితాక్యూషూ సిటీ మేయర్​కజుహిసాటకేజీ ప్రతినిధి బృందం వేడులకు హాజరుకానుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేశారు. జూన్​2 రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకోని కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించనుంది.

రాజీవ్​యువ వికాసం, గ్రామ పాలన అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నది. అలాగే పలు ప్రభుత్వ కార్యక్రమాలు సైతం శ్రీకారం చుట్టునుంది. ఇందులో 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ప్రారంభించనున్నది.

Next Story