- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు క్రిస్మస్ పండుగ.. సీఎం రేవంత్ స్పెషల్ విషెస్
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సీఎం ఎ.రేవంత్‌రెడ్డి క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సీఎం ఎ.రేవంత్‌రెడ్డి క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతటా క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఏసు ప్రభువు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు. ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని వెల్లడించారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని.. ఆయన ఎంచుకున్న మార్గం ఆదర్శనీయమని పేర్కొన్నారు.
యాదగిరిగుట్టకు రండి..
ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించాల్సిందిగా ఆలయ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఆహ్వానించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌తోపాటు ఆలయ అర్చకులు సీఎంను వారి నివాసంలో కలిసి ఆహ్వానించారు.






