- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా గిరి జల వికాసం పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 23 మంది చెంచు రైతులకు సౌర పలకలు, పంపు సెట్లు పంపిణీ చేస్తారు. అక్కడ నుండి తమ సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళతారు. అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరా గిరి జల వికాసం పథకాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఆర్‌వోఎఫ్ఆర్ పట్టాలు ఉన్న రైతులకు ఈ పథకం వర్తించనుంది. ఐదేళ్లలో 2.10 లక్షల మంది గిరిజనులకు లబ్ది చేకూరేలా ఈ పథకానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పథకాన్ని ప్రారంభిస్తున్నారు.






