- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
5PM Dynamic : లిక్కర్‌కేసులో సిట్ దూకుడు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలజడి.. నిర్మాత పరారీ

గత వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కేసు దర్యాప్తును సిట్ స్పీడప్ చేసింది. మద్యం కుంభకోణం విచారణను వేగవంతం చేసింది. విచారణకు హాజరు కావాలంటూ కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఇవాళ మరోసారి నోటీసులు పంపింది. కసిరెడ్డి పెట్టుబడులపై ఇప్పటికే సిట్ వివరాలు సేకరించింది. కసిరెడ్డి పెట్టుబడి పెట్టిన చిత్ర పరిశ్రమకు చెందిన వారిని కూడా విచారించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.
సాధారణంగా మన దేశంలో ఖైదీలను సత్ప్రవర్తన పేరుతో విడుదల చేయడం చూశాం. అయితే వేశ్యను పెళ్లి చేసుకుంటే ఖైదీలను వదిలేసింది ఫ్రెంచ్ ప్రభుత్వం. ఖైదీలకు స్వేచ్ఛను ప్రసాదించేందుకు ప్రాస్టిట్యూట్స్‌ను వివాహం చేసుకోవాలనే నిబంధన విధించింది. పారిస్‌లోని ఖైదీలకు ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వివాహం చేసుకుని లూసియానాకు వలస వెళ్లాలని షరతు విధించింది. ఈ వింత రూల్‌కు సంబంధించిన వివరాలను ఈ లింక్‌లో తెలుసుకోండి.
ఆ కాలనీలో రోడ్డు వేసి, కాలనీవాసుల కల నెరవేర్చారు. అయితే రోడ్డుకు అడ్డుగా ఉన్న కారును మాత్రం అలాగే ఉంచారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నంలో ఓ కాంట్రాక్టర్ ఘన కార్యం వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్టర్ ఒకరి ఇంటి ముందు నిలిపిన కారును పక్కకు తీసేయకుండానే సిమెంట్ రోడ్డు వేసేశారు. రోడ్డు వేసేటప్పుడు తీసి పక్కన పెట్టాలనే విచక్షణ కూడా మర్చిపోయారు. ఇంతకూ ఏం జరిగిందో ఈ లింక్‌లో చూడండి.
తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఫేక్ ప్రచారం విషయంలో ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ఏఐ వీడియోలు, చిత్రాల ద్వారా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారని, వీరి వెనుక ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ప్రభుత్వానికి నిఘా వర్గాలు నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడిన ఆయా యూట్యూబ్ చానళ్లు, న్యూస్ వెబ్ సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే స్మితా సబర్వాల్‌కు కూడా పోలీసులు సమన్లు ఇచ్చారు. అసలు ఈ కేసు ఏంటి.. ఈ యంగ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేయనున్నారో ఈ లింక్‌లో చూడండి.