- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు ఉంటాయని హెచ్చరించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు ఉంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈదురుగాలులు, ఉరుముల సమయంలో బయటకు వెళ్లడం మానుకోవాలని సూచించింది.
రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అలాగే ఆదిలాబాద్ , భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, అసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్ గిరి, మలుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో ఉరుములు, మెరుపులు, గాలివేగం గంటకు 30 నుంచి 40 కి.మీ వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.






