- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు భారీ వర్షసూచన.. నేడు హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో వానలు
తెలంగాణలో నవంబర్ వచ్చినా వర్షాలు ఆగడంలేదు. రాష్ట్రంలో గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక నేడు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో నవంబర్ వచ్చినా వర్షాలు ఆగడంలేదు. రాష్ట్రంలో గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక నేడు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, నల్గొండ, వికారాబాద్, నారాయణ్ పేట్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదే విధంగా సంగారెడ్డి, రంగారెడ్డి, జనగాం జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇక సోమవారం సైతం రాష్ట్రంలోని పలు జిల్లాలను వానలు పలకరించాయి. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో ఓ వైపు ఎండకొడుతుండగా మరోవైపు వర్షం కురిసింది. సాయంత్రం కూడా పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి.






