తెలంగాణ వెదర్ రిపోర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉంటుందంటే?

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలోకి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించిన‌ప్ప‌టికీ ఎండ‌లు మండిపోతూనే ఉన్నాయి. ఇప్ప‌టికీ ప‌లు ప్రాంతాల్లో 30 నుండి 40 డిగ్రీలు ఆపైనే ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. మ‌ధ్య మ‌ధ్య‌లో వ‌ర‌ణుడు వ‌చ్చి బాయ్ చెప్పి వెళ్లిపోతుండ‌టం, ఎండ‌లు మండిపోవ‌డంతో ఉక్కపోత‌తో ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డుతున్నారు.

తెలంగాణ వెదర్ రిపోర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉంటుందంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్: రాష్ట్రంలోకి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించిన‌ప్ప‌టికీ ఎండ‌లు మండిపోతూనే ఉన్నాయి. ఇప్ప‌టికీ ప‌లు ప్రాంతాల్లో 30 నుండి 40 డిగ్రీలు ఆపైనే ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. మ‌ధ్య మ‌ధ్య‌లో వ‌ర‌ణుడు వ‌చ్చి బాయ్ చెప్పి వెళ్లిపోతుండ‌టం, ఎండ‌లు మండిపోవ‌డంతో ఉక్కపోత‌తో ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డుతున్నారు. ఇక ఈరోజు కూడా రాష్ట్రంలో ఎండ‌ల ప్ర‌భావ‌మే ఎక్కువ అని వ‌డ‌గాల్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. నార్త్ తెలంగాణ‌లో 40 నుండి 42 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదయ్యే ఛాన్స్ ఉంద‌ని తెలిపారు. ద‌క్షిణ తెలంగాణ‌లో 38 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదయ్యే ఛాన్స్ ఉంద‌ని పేర్కొన్నారు.

అదే విధంగా ఈస్ట్ తెలంగాణ ప్రాంతాల్లో 39 నుండి 41 డిగ్రీల ఉష్ణోగ్ర‌తలు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇక రాష్రంలోని కొన్ని జిల్లాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు సైతం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. నాగ‌ర్ క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి, వికారాబాద్, సంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, నారాయ‌ణ్ పేట్, గ‌ద్వాల‌, న‌ల్గొండ‌, సూర్యాపేట్, యాదాద్రి భువ‌న‌గిరి, హ‌న్మ‌కొండ‌, వ‌రంగ‌ల్, ములుగు, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, మంచిర్యాల‌, అసిఫాబాద్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి స‌మ‌యంలో వ‌ర్షం కురిసే ఛాన్స్ ఉంద‌న్నారు. హైద‌రాబాద్ లోనూ సాయంత్రం, రాత్రి స‌మ‌యంలో వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు.

Next Story