రాష్ట్రంలో భగ్గుమంటున్న ఎండలు.. నేడు ఈ జిల్లాల్లో వైల్డ్ ఫైరే!

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో ఎండ‌లు భ‌గ్గుమంటున్నాయి. చాలా జిల్లాలో 26 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదవుతున్నాయి. ఎండ‌ల‌తో పాటు వ‌డ‌గాలుల‌తో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. భ‌య‌ట‌కు రావాలంటే వ‌ణికిపోతున్నారు.

రాష్ట్రంలో భగ్గుమంటున్న ఎండలు.. నేడు ఈ జిల్లాల్లో వైల్డ్ ఫైరే!
X

దిశ‌, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎండ‌లు భ‌గ్గుమంటున్నాయి. చాలా జిల్లాలో 26 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదవుతున్నాయి. ఎండ‌ల‌తో పాటు వ‌డ‌గాలుల‌తో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. భ‌య‌ట‌కు రావాలంటే వ‌ణికిపోతున్నారు. ఇక ఈ రోజు సైతం అదే రేంజ్ లో ఎండ‌లు దంచికొట్టే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు వెద‌ర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. ప‌లు జిల్లాల్లో హీట్ వేవ్ ఉంటుంద‌ని తెలిపారు. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మ‌ల్, నిజామాబాద్, జ‌గిత్యాల‌, మంచిర్యాల్, క‌రీంన‌గ‌ర్, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, సూర్యాపేట్ జిల్లాల్లో 43 నుండి 46 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు ఉంటాయ‌ని పేర్కొన్నారు. అంతేకాకుండా ద‌క్షిణ తెలంగాణ‌, ప‌శ్చిమ తెలంగాణ జిల్లాలైన నారాయ‌ణ్ పేట్, వికారాబాద్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, గ‌ద్వాల్, నాగ‌ర్ క‌ర్నూల్, సంగారెడ్డి జిల్లాల్లో సాయంత్రం నుండి రాత్రి స‌మ‌యంలో ఉరుములు, మెరుపులు సంభ‌విస్తాయ‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్ లో తేలిక‌పాటి వ‌ర్షం లేదా పొడివాతావ‌ర‌ణం ఉండే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

Next Story